సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కొత్తగా ట్రై చేసే కథానాయిక 
  • వచ్చే నెల నుంచి బాలకృష్ణ సినిమా 
  • గోపీచంద్ సినిమాలో కామెడీ స్టార్
*  ఏ విషయంలోనైనా సరే కొత్తగా ట్రై చేయడం అన్నది తనకి మొదటి నుంచీ అలవాటని అంటోంది అందాల నాయిక కాజల్. 'అందరిలా కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నించడం అంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. అన్ని విషయాల్లోనూ అలాగే వుంటాను. అందుకే సినిమాల్లో కూడా సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ వుంటాను. ఇలాంటప్పుడే జీవితంలో థ్రిల్ వుంటుంది' అని చెప్పింది కాజల్.
*  బాలకృష్ణ కథానాయకుడుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క, ఇందులో ఓ హీరోయిన్ గా శ్రియాను ఎంపిక చేశారు.
*  గోపీచంద్ హీరోగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'చాణక్య' చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు సునీల్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. సునీల్ పాత్ర సినిమా మొత్తం సాగుతూ నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది.
Kajal Agarwal
Balakrishna
Shriya
Gopichand

More Telugu News