అందరూ దూరమయ్యారు .. కేన్సర్ దగ్గరైంది: 'అల్లరి' సుభాషిణి
Add ap7am to your home Screen

అందరూ దూరమయ్యారు .. కేన్సర్ దగ్గరైంది: 'అల్లరి' సుభాషిణి

  • అమ్మానాన్నలు పోయారు 
  • అక్కాతమ్ముడు కూడా చనిపోయారు
  • జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాను     
'అలీతో సరదాగా' కార్యక్రమంలో 'అల్లరి' సుభాషిణి మాట్లాడుతూ, తనకి ఎదురైన విషమ పరిస్థితులను గురించి చెప్పుకొచ్చింది. "మా నాన్నగారు కాలం చేశారు .. అన్నీ తానై మమ్మల్ని చూసుకునే అమ్మ కూడా వెళ్లిపోయింది. దాంతో  అమ్మ బాధ్యతను అక్కయ్య తీసుకుంది. కానీ ఆమెను కూడా కోల్పోయాను. కుటుంబానికి తమ్ముడు అండగా ఉంటాడని అనుకుంటే, దేవుడు వాడిని కూడా తీసుకెళ్లిపోయాడు.

నాకు ఒక బాబు .. మా తమ్ముడి పిల్లలిద్దరి బాధ్యత మా పైనే పడింది. ఎలాగోలా బండిని నడిపించాలనుకుంటే మా ఆయన కూడా కాలం చేశాడు. అలా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాను. అలాంటి పరిస్థితుల్లో నాకు కేన్సర్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మనసున్న మహారాజులు కొంతమంది ఆదుకోవడంతో ఆ గండం నుంచి గట్టెక్కాను" అని చెప్పుకొచ్చారు"
allari subhashini
ali

More Telugu News