Bonda Uma: మా హయాంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు: బొండా ఉమ మండిపాటు

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ మండిపడ్డారు. నిర్మాణరంగంపై ప్రభావం పడరాదనే సదుద్దేశంతో తాము ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. వైసీపీ మాత్రం సమీక్ష పేరుతో ఇసుక రవాణాను నిలిపివేసిందని... ఇది చాలా దారుణమని అన్నారు. ఇసుక విధానంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీని తమ అధినేత చంద్రబాబు అన్ని విధాలా అభివృద్ధి చేశారని చెప్పారు.
Go Back to Shorts
Bonda Uma
Chandrababu
ysrcp
Telugudesam

More Telugu News