Chandrababu: గెలిచినా, ఓడినా పులి పులే: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పోరాడుతూనే ఉంటారని టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చెప్పారు. గెలిచినా, ఓడినా పులి పులేనని అన్నారు. శాసనమండలిలో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడించింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో ప్రత్యేక ప్యాకేజీని సమర్థిస్తూ తీర్మానం చేసింది టీడీపీనే అని... ప్రత్యేక హోదాను కాదని రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు.
Go Back to Shorts
Chandrababu
rajendraprasad
Telugudesam
botsa
ysrcp

More Telugu News