ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ లా 'కల్కి' ఉత్కంఠను రేపుతుంది: దర్శకుడు ప్రశాంత్ వర్మ
- రాజశేఖర్ నుంచి 'కల్కి'
- ఆయన సరసన ఆదా శర్మ
- ఈ నెల 28వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమాను గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో రాజశేఖర్ మరింత అద్భుతంగా చేశారు. నిర్మాత కల్యాణ్ గారు ఖర్చుకు వెనుకాడలేదు .. ఆ విషయం మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతటి ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుంది. త్వరలో ట్రైలర్ ను వదలనున్నాము" అని చెప్పాడు. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ఆదా శర్మ నటించిన సంగతి తెలిసిందే.