Congress: ఛీ ఛీ ఇదేం రాజకీయం...తప్పుకోవాలనిపిస్తోంది : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛీ ఛీ ఇదేం రాజకీయం. వీటిని చూస్తుంటే ఏకంగా రాజకీయాల నుంచే విరమణ తీసుకోవాలనిపిస్తోంది అంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ  కాంగ్రెస్‌ చేపడుతున్న దీక్ష శిబిరాన్ని ఈరోజు ఆయన సందర్శించారు.

ఈ శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు నాయకత్వ వైఫల్యం ఎలా అవుతుందన్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత అవసరాల కోసం పార్టీ మారితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు  రాహుల్‌ గాంధీలు ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎవరు ఎలా వ్యవహరించినా తాను మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
Congress
jaggareddy
MLA's

More Telugu News