వారితో కలిసి తొలిరోజు ‘ఓ బేబి’ చిత్రాన్ని చూస్తా: సమంత
- అద్భుతమైన వ్యక్తుల్ని కలిశా
- వారి కథలు నాతోనే ఉన్నాయి
- వారి చిన్నపిల్లల మనస్తత్వం ఆశ్చర్యమేసింది
‘తాను వృద్ధాశ్రమంలో అద్భుతమైన వ్యక్తుల్ని కలిశానని, షూటింగ్ జరిగినన్ని రోజులు వారి కథలు తనతోనే ఉన్నాయని తెలిపింది. అక్కడి వృద్ధులలోని చిన్నపిల్లల మనస్తత్వం చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. వారి స్వభావాన్ని తన మైండ్‌లో పెట్టుకునే ‘బేబక్కా’ పాత్రను చేశానని సామ్ తెలిపింది. ‘ఓ బేబీ’ సినిమాను తొలిరోజు వారితో కలిసి చూస్తానని వెల్లడించింది. ఓ బేబీ’ ఒక ఎమోషనల్ చిత్రమని, అది జూలై 5న విడుదల కాబోతోందని సమంత పేర్కొంది.