Rakesh Powar: మహారాష్ట్ర క్రికెటర్ రాకేశ్ పవార్ దారుణ హత్య!

  • ప్రస్తుతం మహారాష్ట్రకు ఆడుతున్న రాకేశ్
  • పెట్రోల్ కోసం రాగా దుండగుల దాడి
  • సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్న పోలీసులు
మహారాష్ట్రకు చెందిన వర్ధమాన క్రికెటర్‌ రాకేశ్ పవార్ ను గత రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ముంబై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ప్రస్తుతం మహారాష్ట్ర క్రికెట్ టీమ్ లో ఉన్న రాకేశ్, రంజీ జట్టులో చోటు దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. నిన్న రాత్రి బందప్ ప్రాంతంలోని ఓ ఫ్యూయల్ స్టేషన్ కు పెట్రోల్ కోసం రాకేశ్ వచ్చాడు. ఆ వెంటనే అతనిపై దాడి జరిగింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Rakesh Powar
Murder
Police
Petrol
Cricketer

More Telugu News