పులుల లెక్కను బయటపెట్టొద్దు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌టీసీఏ ఆదేశం
- ప్రతీ నాలుగేళ్లకోసారి పులుల గణాంకాలను విడుదల చేసే ఎన్‌టీసీఏ
- ఏడాదిన్నర ఆలస్యమైనా ఇంకా విడుదల చేయని వివరాలు
- రాష్ట్రాలు పంపిన డేటాను విశ్లేషిస్తున్నట్టు వివరణ
పులుల లెక్కకు సంబంధించి ఆయా రాష్ట్రాలు పంపిన రా డేటాను ఇప్పటి వరకు విశ్లేషించలేదని ఎన్‌టీసీఏ తెలిపింది. వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఈ డేటాను విశ్లేషించి సరైన గణాంకాలను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ విషయంలో పులుల సంఖ్యకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు విడుదల చేస్తున్న డేటాలో ప్రామాణికత లేదని, కాబట్టి ఆ గణాంకాలను విడుదల చేయవద్దని పులులు కలిగిన రాష్ట్రాలకు ఎన్‌టీసీఏ ఆదేశాలు జారీ చేసింది.