లేటు వయసులో ప్రేమలో పడే 'పండుగాడు'గా అలీ
Add ap7am to your home Screen

లేటు వయసులో ప్రేమలో పడే 'పండుగాడు'గా అలీ

  • హీరోగా అలీ నుంచి మరో చిత్రం
  •  హాస్యప్రధానంగా సాగే కథ
  •  ఈ నెల చివరిలో విడుదల  
చాలాకాలం క్రితమే 'యమలీల' సినిమాతో అలీ హీరో అయ్యాడు. అప్పటి నుంచి ఒక వైపున కమెడియన్ గా చేస్తూనే మరో వైపున అవకాశాన్ని బట్టి హీరోగానూ అలరిస్తున్నాడు. అలా అలీ ఇంతవరకూ 1150 సినిమాలను పూర్తిచేశాడు. చాలా గ్యాప్ తరువాత ఆయన హీరోగా మరో సినిమా చేస్తున్నాడు .. ఆ సినిమా పేరే 'పండుగాడి ఫొటో స్టూడియో'.

వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి దిలీప్ రాజా దర్శకుడిగా వ్యవహరించాడు. లేటు వయసులో ప్రేమలో పడే కథానాయకుడి కథగా .. జంధ్యాల మార్క్ కామెడీతో ఈ సినిమా సాగుతుందట. వినోద్ కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల చివరిలో విడుదల చేయనున్నారు. బాబూ మోహన్ .. సుధ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
ali
rishita

More Telugu News