Telangana: జడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పలేదు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఓ మోస్తరు ఫలితాలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం జాతీయపార్టీకి పరాభవం తప్పలేదు. 32 జిల్లాల్లో ఎక్కడా ఒక్క జడ్పీ దక్కిన పాపానపోలేదు. కామారెడ్డి జిల్లాలో గట్టిపోటీ ఇచ్చినా ఫలితం మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వెళ్లింది. అది తప్ప జడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. మిగతా జిల్లాల్లో సోదిలో కూడా లేకుండా పోయింది. ఆరు జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. అయితే, జడ్పీటీసీ ఎన్నికల కంటే ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త మెరుగైన ఫలితాలు సాధించింది. 1377 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది.
Go Back to Shorts
Telangana
TRS
Congress

More Telugu News