స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని జగన్ నిర్ణయం!

  • రేపు విశాఖకు జగన్
  • మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కోసమే
  • స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్న జగన్
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆయన విశాఖ పర్యటన మంగళవారం ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు విశాఖ చేరుకునే ఆయన, స్వరూపానందను దర్శించుకోనున్నారు. ఆపై తిరిగి అమరావతి చేరుకుంటారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను దర్శించుకోలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.
Go Back to Shorts
Jagan
Vizag
Swaroopananda

More Telugu News