tmc: మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా షాక్ ఇస్తున్నారు. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా మరో ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లాం బీజేపీ గూటికి చేరారు. ఆయనతో పాటు మరో ముగ్గురు నేతలు గదాధర్ హజ్రా, మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్, నిమాయ్ దాస్ లు కూడా బీజేపీలో చేరారు. వరుసగా తమ నేతలు బీజేపీలో చేరుతుండడం టీఎంసీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై టీఎంసీ పూర్తిగా దృష్టిని సారించింది.
Go Back to Shorts
tmc
bjp
mamata banerjee

More Telugu News