YSRCP: లోకేశ్ నాతో పోటీకి సరిపోడు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ మంత్రి నారా లోకేశ్ ను ఓడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోకేశ్ ఏ విధంగానూ తనతో పోటీకి సరిపోడని అభిప్రాయపడ్డారు. లోకేశ్ కు ప్రత్యక్ష రాజకీయాలపై ఏమాత్రం అవగాహనలేదని, ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు కొడుకును బరిలో దింపారని ఆళ్ల విమర్శించారు. ఆ విధంగా లోకేశ్ ఓటమికి చంద్రబాబే పరోక్షంగా కారకులయ్యారని ఆరోపించారు. జగన్ పాలనపై ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన పనిలేదని, ముఖ్యంగా రైతులు ఏ విషయంలోనూ ఆందోళన చెందనక్కర్లేదని వివరించారు.