నిర్మాతల పద్ధతి నచ్చలేదు.. అందుకే హిందీ 'కాంచన' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాను: లారెన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతల పద్ధతి నచ్చలేదు.. అందుకే హిందీ 'కాంచన' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాను: లారెన్స్

  • నాకు చెప్పకుండా అక్షయ్ లుక్ రిలీజ్ చేశారు  
  • అక్షయ్ కుమార్ తో సమస్య లేదు
  • అక్షయ్ పట్ల గౌరవంతో స్క్రిప్ట్ ఇచ్చేశాను
తెలుగులో లారెన్స్ కథానాయకుడిగా ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమాను అక్షయ్ కుమార్ కథానాయకుడిగా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగిపోయాయి. ఈ రీమేక్ కి లారెన్స్ నే దర్శకుడిగా తీసుకున్నారు. తుషార్ కపూర్ .. షాబినా ఖాన్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇటీవలే అక్షయ్ కుమార్ గెటప్ కి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఆ వెంటనే తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా లారెన్స్ ప్రకటించారు. ఈ విషయంపై లారెన్స్ మాట్లాడుతూ .. "నాకు తెలియకుండా .. నాతో ఒక మాటైనా చెప్పకుండా ఈ సినిమా నుంచి అక్షయ్ కుమార్ లుక్ ను రిలీజ్ చేశారు. దర్శకుడికి తెలియకుండా నిర్మాతలు ఈ విధంగా చేయడం నాకు నచ్చలేదు .. అందుకే తప్పుకున్నాను. నాకు అక్షయ్ కుమార్ తో ఎలాంటి సమస్యా లేదు .. ఆయనంటే గౌరవం వుంది. అందుకే స్క్రిప్ట్ మాత్రం ఇచ్చేశాను" అని ఆయన చెప్పుకొచ్చారు.
lawrence
akshay kumar

More Telugu News