వరుసగా ప్రేమకథా చిత్రాలు చేయడం వలన బస్తాల కొద్దీ లవ్ లెటర్స్ వచ్చేవి: నటుడు ప్రదీప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుసగా ప్రేమకథా చిత్రాలు చేయడం వలన బస్తాల కొద్దీ లవ్ లెటర్స్ వచ్చేవి: నటుడు ప్రదీప్

  • నా తొలి సినిమా 'ముద్దమందారం'
  • 'నాలుగు స్థంభాలాట' 175 రోజులు ఆడింది 
  • ఇక 'రెండు జెళ్ల సీత' కూడా సూపర్ హిట్   
తాజా ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ, తన కెరియర్ ఎలా ఆరంభమైందనే విషయాన్ని గురించి ప్రస్తావించారు. " జంధ్యాల గారు కబురు చేయడంతో చెన్నై వెళ్లి ఆయనను కలిశాను. అక్కడే ఆయన తన సినిమాకి తగినట్టుగా నా లుక్ మార్చేశారు. అంతా కూడా అచ్చు కమలహాసన్ మాదిరిగా వున్నాడు అన్నారు. అలా నా మొదటి సినిమాగా 'ముద్దమందారం' చేశాను .. 100 రోజులు ఆడింది.

ఆ తరువాత 'నాలుగు స్థంభాలాట' చేశాను .. 175 రోజులు ఆడింది. 'రెండు జెళ్ల సీత' కూడా సూపర్ హిట్ అయింది. వరుసగా ప్రేమకథా చిత్రాలు చేయడం .. అవి భారీ విజయాలను అందుకోవడంతో నాకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. చెబితే నమ్మరు .. ప్రతి రోజు నాకు బస్తాల కొద్దీ లవ్ లెటర్స్ వచ్చేవి. అంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ, జీవితానికి సెక్యూరిటీ లేదనే ఆలోచన మనసును తొలుస్తూ ఉండటంతో నా రూటు మార్చుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
pradeep
jandhyala

More Telugu News