'అంతేగా .. అంతేగా' డైలాగ్ అంత పాప్యులర్ అవుతుందని అనుకోలేదు: నటుడు ప్రదీప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అంతేగా .. అంతేగా' డైలాగ్ అంత పాప్యులర్ అవుతుందని అనుకోలేదు: నటుడు ప్రదీప్

  • 'ఎఫ్ 2'లో తమన్నా ఫాదర్ పాత్ర కోసం అడిగారు 
  • సినిమా అంతా ఒకే డైలాగ్ ఉంటుందని చెప్పారు
  • ఆ పాత్ర చేయడానికి ఆలోచనలో పడ్డాను
ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో 'ఎఫ్ 2' కూడా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రదీప్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆయన చెప్పిన 'అంతేగా .. అంతేగా' డైలాగ్ ఎంతో పాప్యులర్ అయింది.

ఆ విషయాన్ని గురించి తాజాగా ప్రదీప్ మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడి నన్ను కలిసినప్పుడు ' ఈ సినిమాలో మీకో వేషం వుంది చేయాలి' అన్నారు. 'ఏ వేషం?' అని నేను అడిగితే, 'తమన్నా ఫాదర్ వేషం .. సినిమా అంతా ఉంటుంది' అన్నాడు. 'కొన్ని రోజుల తరువాత సినిమా అంతా ఒకే డైలాగ్ ఉంటుంది సార్' అని చెప్పాడు. దాంతో నేను ఆలోచించాను .. చేయవచ్చా అని భయపడ్డాను కూడా. అది గమనించిన అనిల్ రావిపూడి, థియేటర్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్ .. మీ డైలాగే చెప్పుకుంటూ వస్తారండి' అన్నాడు. నిజంగా ఆయన చెప్పినట్టుగానే జరిగింది" అని చెప్పుకొచ్చారు.
pradeep

More Telugu News