శ్రీదేవిని వెండితెరకి నేనే పరిచయం చేశాను .. అలాంటి అమ్మాయిని నేను చూడలేదు: 'షావుకారు' జానకి
- శ్రీదేవి తొలిసారిగా బాలసుబ్రహ్మణ్యుడి వేషం వేసింది
- మొదటి సారే అద్భుతంగా డైలాగ్ చెప్పింది
- పెద్ద స్టార్ అవుతుందని అప్పుడే అనుకున్నాను
శ్రీదేవి తల్లి రాజేశ్వరి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేది .. శ్రీదేవిని కూడా షూటింగ్స్ కి తీసుకొచ్చేది. చిన్నప్ప దేవరగారు నాకు ఆ మాట చెబుతున్నప్పుడు, రాజేశ్వరి నాకు కాస్త దూరంలో శ్రీదేవిని పట్టుకుని నుంచుని వుంది. అప్పుడు శ్రీదేవి వయసు ఆరేళ్లు. నేను ఆ నిర్మాతకు శ్రీదేవిని చూపిస్తూ ఆ పాపకు ఒకసారి మేకప్ వేసి చూడండి అన్నాను. ఆయన మేకప్ వేసి డైలాగ్ చెప్పమంటే అద్భుతంగా చెప్పింది. అప్పుడే ఈ అమ్మాయి పెద్ద స్టార్ అవుతుందని చెప్పాను .. అలాగే అయింది. నటన పట్ల అంతటి అంకితభావం వున్న అమ్మాయిని నేను మళ్లీ చూడలేదు" అని చెప్పుకొచ్చారు.