ఐపీఎల్లో బెంగళూరు జట్టు అట్టడుగున నిలవడంపై విజయ్ మాల్యా స్పందన
- అందరూ మంచి ఆటగాళ్లే
- ఆ బలం కాగితంపైనే అని నిరూపించుకున్నారు
- పరమచెత్త ఆటతీరుతో నాశనం చేశారు
ఎప్పుడు చూసినా బెంగళూరు టీమ్ లో మంచి ఆటగాళ్లు ఉంటారని, కానీ ఆ బలం అంతా కాగితాలపైనే అని మరోసారి రుజువైందని ట్వీట్ చేశారు. పరమచెత్త ఆటతీరుతో మొత్తం నాశనం అయిపోయిందంటూ వాపోయారు. అంతకుముందు, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చే ఏడాది మరింత పట్టుదలతో బరిలో దిగుతామని పోస్టు పెట్టాడు. దానికి స్పందనగానే విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.