విమానంలోనే వాడి గూబ పగలగొట్టేశాను: నటి రక్ష
- చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ
- కాలేజ్ రోజుల్లో మగ పిల్లలు భయపడేవాళ్లు
- నా చేతిలో చాలామందే తన్నులు తిన్నారు
ఇక బి.గోపాల్ గారు 'రవన్న' సినిమా షూటింగు కోసమని చెప్పి నేను చెన్నై నుంచి విమానంలో హైదరాబాద్ వస్తున్నాను. విమానంలో నేను విండో సీట్లో కూర్చుంటే, నా పక్కన ఒక పెద్దాయన కూర్చున్నాడు. కావాలని చెప్పేసి నన్ను తాకడం మొదలుపెట్టాడు. నేను విండో వైపుకు జరుగుతున్నకొద్దీ ఎక్కువ చేస్తున్నాడు. దాంతో 'ఏంట్రా ఇంత వయసొచ్చినా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్' అని గూబ పగలగొట్టాను. అక్కడ వున్న వాళ్లంతా నన్ను సపోర్ట్ చేయడం వలన ఆ మనిషి కిక్కురుమనలేదు" అని చెప్పుకొచ్చారు.