హబుల్ టెలిస్కోప్ ను అంతరిక్షంలోకి పంపింది తామేనంటూ చెప్పి నవ్వులపాలైన పాకిస్థాన్ మంత్రి
- పాక్ అంతరిక్ష సంస్థ సుపార్కో హబుల్ ను రోదసిలో పంపిందన్న ఛౌదరీ
- 1990లో హబుల్ ను ప్రవేశపెట్టిన నాసా
- మంత్రిపై పేలుతున్న సెటైర్లు
మంత్రిగారు చెప్పింది విన్న న్యూస్ చానల్ యాంకర్ కు మతిపోయిందన్నది వేరే విషయం! దీనిపై నెట్టింట జోకులు మామూలుగా పేలడంలేదు. నాసా హెడ్ రాజీనామా చేసి ఫవాద్ చౌధరీ ఆధ్వర్యంలోని సుపార్కోలో జాయిన్ అవ్వాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇలాంటి గొప్ప ఆవిష్కర్తను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్జంటుగా రోదసిలోకి ప్రయోగించాలని మరో నెటిజన్ సెటైర్ వేశారు.
కోట్లాది కాంతిసంవత్సరాల దూరాల్లో ఉండే నక్షత్రాలను, కొత్త గ్రహాలను గుర్తించేందుకు నాసా 1990లో హబుల్ టెలిస్కోప్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అయితే ఆ విషయం తెలియని పాక్ సైన్స్ మినిస్టర్ ఫవాద్ ఛౌదరీ అదేదో తమ ఘనత అన్నట్టు చెప్పుకొచ్చారు.