యాక్షన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్షన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్

  • తిరు దర్శకత్వంలో గోపీచంద్
  • యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే కథ
  •  కీలకపాత్రలో జరీన్ ఖాన్ 
తెలుగు తెరపై అందాల కథానాయికగా అత్యధిక మార్కులు కొట్టేసినవారి జాబితాలో మెహ్రీన్ కనిపిస్తుంది. ఈ మధ్య మెహ్రీన్ చేసిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో గ్లామర్ పరంగానే కాదు .. నటన పరంగాను ప్రశంసలు దక్కించుకుంది. ఈ సక్సెస్ తరువాత ఆమె వరుస సినిమాలు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో ఆమె అవకాశాలను అందుకోలేకపోయింది.

కాస్త ఆలస్యంగానే ఆమె ఒక ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గోపీచంద్ హీరోగా దర్శకుడు 'తిరు' ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన మెహ్రీన్ ను తీసుకున్నాడు. కథ .. తన పాత్ర నచ్చడం వలన, వెంటనే మెహ్రీన్ అంగీకరించినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి 'జరీన్ ఖాన్' ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. 
mehreen
gopichand

More Telugu News