ఉగ్రదాడుల అనంతరం తన మేలుజాతి శునకాలను సైన్యానికి అప్పగించిన శ్రీలంక మహిళా లెక్చరర్
- అన్నీ జర్మన్ షెపర్డ్ శునకాలే!
- సర్వత్రా అభినందనలు
- త్వరలోనే కుక్కలకు ప్రత్యేక శిక్షణ
ఆ ఐదు కుక్కలు జర్మన్ షెపర్డ్ జాతికి చెందినవి. వాటికి సరైన రీతిలో శిక్షణ ఇస్తే పేలుడు పదార్థాలను ఇట్టే పసిగట్టేస్తాయి. ఈ విషయం తెలిసిన డాక్టర్ షిరు విజేమన్నే ఆ కుక్కలు తన వద్ద ఉండడం కంటే సైన్యం వద్ద ఉంటేనే దేశానికి ఉపయోగం అని భావించారు. అందుకే వాటిని బ్రిగేడియర్ అమరసకేరాకు అప్పగించారు.
ఆ ఐదు జర్మన్ షెపర్డ్ కుక్కలకు త్వరలోనే శ్రీలంక ఇంజినీర్స్ స్క్వాడ్రన్ లో ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ మహిళా లెక్చరర్ స్ఫూర్తిదాయక చర్య సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరూ ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.