Mahesh Babu: 'మహర్షి' నుంచి దుమ్మురేపుతోన్న పాలపిట్ట సాంగ్

షార్ట్స్‌లో చూడండి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'మహర్షి' వచ్చేనెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి సోషల్ మీడియా ద్వారా ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు.

"పాలపిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే .. పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే .. తేనె పట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే'' అంటూ ఈ పాట జోరుగా .. హుషారుగా సాగుతోంది. యూత్ కి .. మాస్ ఆడియన్స్  మనసుకి పట్టే బీట్ తో ఈ పాట పరుగులు తీస్తోంది. శ్రీమణి సాహిత్యం .. రాహుల్ సిప్లి గంజ్ .. మానసి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. తేలికైన పదాలతో అందంగా అల్లిన ఈ పాటకి జనంలోకి దూసుకెళ్లే లక్షణాలు పుష్కలంగా వున్నాయి. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పాటల్లో ఇది దుమ్మురేపేసే పాటేనని చెప్పొచ్చు
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News