పేలుడు పదార్థాలతో కొలంబో దిశగా బయల్దేరిన కంటెయినర్.. శ్రీలంకలో హైఅలర్ట్!
- కంటెయినర్ కోసం పోలీసుల గాలింపు
- మరోసారి వరుస పేలుళ్లు జరగొచ్చని నిఘా సమాచారం
- ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
ఆ కంటెయినర్ లో భారీస్థాయిలో పేలుడు పదార్థాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన దాడులకు ఐసిస్ తమదే బాధ్యత అని ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, హోటళ్ల వద్ద భద్రత మరింత పెంచారు.