'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తెరపైకి చిరంజీవి పేరు
- నిఖిల్ నుంచి 'అర్జున్ సురవరం'
- కథానాయికగా లావణ్య త్రిపాఠి
- మే 1వ తేదీన భారీ విడుదల
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. చిరంజీవికి .. 'ఠాగూర్' మధుకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఆయన ఆహ్వానిస్తే చిరంజీవి తప్పనిసరిగా వస్తారని చెప్పుకుంటున్నారు. కనుక ఈ వేడుకకి ముఖ్య అతిథి చిరంజీవి అని చెప్పుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు.