రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రాజశేఖర్ డూప్‌కు గాయాలు
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు
- తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు దంపతులు
- ప్రమాదానికి కారణమైన కారు కోసం గాలిస్తున్న పోలీసులు
ఈ ఘటనలో ఆంజనేయులు కాళ్లు, చేతులకు గాయాలు కాగా, ఆయన భార్య కూడా గాయపడింది. ఘటనపై ఆంజనేయులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.