ఎవరు కనిపిస్తే వారిని పీకింది... 66 మందిని కరిచిన కుక్క!
- తమిళనాడులోని సేలంలో ఘటన
- పిచ్చి పట్టి ఇష్టానుసారం దాడులు
- కొట్టి చంపిన స్థానికులు
కుక్క దాడిలో గాయపడిన వారిలో అత్యధికులు సేలం ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టారు. కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వెళ్లారు. దాడి చేసిన కుక్కకు పిచ్చి పట్టిన కారణంగా వీరందరికీ రేబిస్ టీకాలు వేశామని వైద్యలు తెలిపారు. ఆపై కుక్కను వేటాడిన స్థానికులు పట్ట కోయిల్ ప్రాంతంలో దాన్ని గుర్తించి, కొట్టి చంపారు.