త్రిష తాజా చిత్రం షూటింగు మొదలు .. టైటిల్ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిష తాజా చిత్రం షూటింగు మొదలు .. టైటిల్ ఖరారు

  • లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్రిష
  •  టైటిల్ గా 'రాంగి' ఖరారు
  •  దర్శకుడిగా మురుగదాస్ శిష్యుడు        
మురుగదాస్ ఒక వైపున రజనీ 'దర్బార్' సినిమాకి దర్శకుడిగా తన పనులను చక్కబెడుతూనే, మరో వైపున తన శిష్యుడు రూపొందిస్తోన్న సినిమాకి కథను అందించాడు. మురుగదాస్ మంచి రచయిత కూడా. తన సినిమాలకి కథ .. కథనాలను ఆయనే రాసుకుంటాడు. అలా ఆయన భారీ విజయాలనే సొంతం చేసుకున్నాడు. అలాంటి మురుగదాస్ .. తన శిష్యుడు శరవణన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న సినిమాకి కథను అందించాడు.లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి తాజాగా 'రాంగి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్రిష ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువేనని తెలుస్తోంది. ఈ తరహా పాత్ర చేయడం త్రిషకి ఇదే మొదటిసారి అంటున్నారు. '96' భారీ విజయంతో జోరుమీదున్న త్రిషకి, ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. 
trisha

More Telugu News