Andhra Pradesh: ఏపీలో టీడీపీకి 130 అసెంబ్లీ, 20 లోక్ సభ సీట్లు రాబోతున్నాయ్!: మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి చంద్రబాబుకు పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో 130 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాలను టీడీపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారని కొల్లు రవీంద్ర  వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Kollu Ravindra
Tirumala

More Telugu News