Rajasekhar: బాహుబలి కంటే పెద్ద ప్యాకేజి కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు: హీరో రాజశేఖర్

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్, ఆయన అర్ధాంగి జీవిత ఇటీవలే వైసీపీలో చేరడమే కాదు, ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉన్న రాజశేఖర్, జీవిత ప్రస్తుతం వైసీపీ అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ టాలీవుడ్ లో వేల కోట్ల సంపాదన వదిలేసి వచ్చాడని, అయితే పవన్ వచ్చింది చంద్రబాబు నుంచి బాహుబలి కంటే పెద్ద ప్యాకేజి కొట్టేయడానికేనని ఆరోపించారు.

కానీ, ఈసారి జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని, వైఎస్సార్ ను మించిపోయే పాలన అందిస్తారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడి అనుభవం చూసి ఓటేశారని, కానీ ఆయన ప్రజలను మోసం చేశాడని రాజశేఖర్ దంపతులు విమర్శించారు. ఇప్పుడు కూడా పసుపు-కుంకుమ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల కోసం బతుకుతున్న వ్యక్తి కేవలం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Rajasekhar
Jeevitha
Jagan
YSRCP

More Telugu News