pooja hegde: పూజా హెగ్డేకి కాలం కలిసొచ్చినట్టే

షార్ట్స్‌లో చూడండి
వెండితెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన పూజా హెగ్డే, హిందీలో 'మొహంజొదారో' చేసింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఆమెకి నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా పరాజయంపాలు కావడం వలన, ఆమెకి అక్కడ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె మళ్లీ టాలీవుడ్ కి తిరిగొచ్చేసి, 'దువ్వాడ జగన్నాథం'తో గ్లామరస్ హీరోయిన్ గా తన సత్తా చాటింది.

దాంతో ఆమెకి ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ సరసన వరుసగా అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్లో చూపుతోన్న జోరు కారణంగా ఆమెకి బాలీవుడ్ నుంచి 'హౌస్ ఫుల్ 4'లో అవకాశం వచ్చింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సాజిద్ నడియాడ్ వాలాకి పూజా నటన విపరీతంగా నచ్చిందట. దాంతో తన బ్యానర్లో మరో రెండు సినిమాల్లో చేసేలా ఆమెతో అగ్రిమెంట్ చేయించుకున్నాడని చెప్పుకుంటున్నారు. చూస్తుంటే పూజా ఈ సారి బాలీవుడ్లో బిజీ అయ్యేలానే వుంది మరి.
Go Back to Shorts
pooja hegde

More Telugu News