నారా లోకేశ్ కు రూ.2,000 నోటు ఇచ్చిన మౌలాలి.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ఏపీ మంత్రి!
- గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మంత్రి లోకేశ్ ప్రచారం
- ఎన్నికల ఖర్చులకు రూ.2 వేలు ఇచ్చిన పెద్దాయన
- మీరు గెలిస్తే మంగళగిరి రూపురేఖలు మారుతాయని వ్యాఖ్య
అనంతరం తాను అందుకున్న రూ.2,000 పెన్షన్ ను లోకేశ్ చేతికి అందించారు. ‘మీరు గెలిస్తే మంగళగిరి రూపురేఖలే మారిపోతాయి. ఆ నమ్మకంతోనే మీ ప్రచార ఖర్చుల కోసం రూ.2 వేలు ఇస్తున్నా’ అని చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన లోకేశ్ ‘మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను. నేను తప్పకుండా ఎన్నికల్లో గెలుస్తాను’ అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మౌలాలీతో దిగిన ఫొటోను నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.