నేడు, రేపు నామినేషన్ల స్వీకరణకు బ్రేక్!
- శని, ఆదివారం సెలవులు
- అందుకే నామినేషన్ల స్వీకరణను ఆపేస్తున్నాం
- సోమవారం తిరిగి నామినేషన్లను స్వీకరిస్తాం
ఈ విషయమై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. రెండ్రోజులు సెలవులు కావడంతో నామినేషన్ల ప్రక్రియ నిలిచిపోతుందని, సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుందని తెలిపారు. ఈ నెల 28 వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని వెల్లడించారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.