చక్రం కాదుకదా, కేసీఆర్ బొంగరం కూడా తిప్పలేరు!: లక్ష్మణ్ మండిపాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చక్రం కాదుకదా, కేసీఆర్ బొంగరం కూడా తిప్పలేరు!: లక్ష్మణ్ మండిపాటు

  • మోదీని టార్గెట్ చేసుకున్న కేసీఆర్
  • మాటల తీరు సరికాదని లక్ష్మణ్ ఆక్షేపణ
  • మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపాటు
ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ చేసిన విమర్శలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ మండిపడ్డారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్, కనీసం బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో తమ పార్టీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన తీరు సరికాదని విమర్శించారు.

 దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని చెప్పుకుంటున్న కేసీఆర్, పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ తొలి స్థానంలో ఉన్నామన్న విషయాన్ని అంగీకరించాలని అన్నారు. మిగులు బడ్జెట్ తో పుట్టిన తెలంగాణను, అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దేనని ధ్వజమెత్తిన లక్ష్మణ్, కేవలం ఫామ్ హౌస్ కు, అక్కడి నుంచి ప్రగతి భవన్ కు పరిమితమైన కేసీఆర్, దేశ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని అన్నారు.
KCR
K Lakshman
TRS
Narendra Modi
BJP

More Telugu News