తండ్రీకొడుకులు చెరో 10 స్థానాల్లో నామినేషన్లు వేయండి.. చంద్రబాబు, లోకేశ్ లపై విజయసాయిరెడ్డి సెటైర్!

  • టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు
  • కులమీడియా, ఇంటెలిజెన్స్ ఉన్నా వలసలు ఆగడంలేదు
  • ట్విట్టర్ లో ఘాటుగా విమర్శించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇంకో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని వ్యాఖ్యానించారు. పరువుపోకుండా ఉండాలంటే చెరో 10 స్థానాల్లో నామినేషన్లు వేయాలని సీఎం చంద్రబాబు, లోకేశ్ లకు విజయసాయిరెడ్డి సూచించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. పోటీకి అభ్యర్థులున్నారా చంద్రబాబు? కుల మీడియా, మీ బంధువు ఇంటెలిజెన్స్ వెంకటేశ్వర్రావు అభ్యర్థులు జారి పోకుండా కాపలా కాస్తున్నా వలసలు ఆగడం లేదు. క్యాండిడేట్లు దొరకలేదని పరువుపోకుండా తండ్రీకొడుకులు చెరో 10 స్థానాల్లో నామినేషన్లు వేయండి’ అని సెటైర్ వేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
Vijay Sai Reddy
Chandrababu
Nara Lokesh
Twitter
Telugudesam

More Telugu News