Andhra Pradesh: సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని యువతిపై అత్యాచారం.. సినిమాటోగ్రాఫర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ సినిమాటోగ్రాఫర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుందేమోనన్న భయంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో సదరు ప్రబుద్ధుడిని  పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని బోడుప్పల్ కు చెందిన ఓ యువతి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో షణ్ముఖ్‌ వినయ్‌ అనే సినిమాటోగ్రాఫర్ ఆమెపై కన్నేశాడు. సినిమా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు. మాదాపూర్ లోని ఓ గెస్ట్ హౌస్ కు యువతిని రప్పించిన వినయ్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించకుండా ఉండేందుకు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు.

చివరికి పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేయడంతో వినయ్ పై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వినయ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
rape
Police

More Telugu News