జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది...ఆయన విజయం కోసం పనిచేస్తా: హాస్య నటుడు అలీ
- ఎప్పుడో పార్టీలో చేరాల్సింది...ఇప్పటికి వీలైంది
- ఎన్నికల్లో మాత్రం పోటీ చేయను
- జగన్‌ని సీఎంగా చూడడమే నా లక్ష్యం
జగన్ మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారని తెలిపారు. ‘ప్రజా సంకల్ప యాత్ర సమయంలోనే నేను జగన్‌ని కలిశాను. మాట్లాడాను. పార్టీలో చేరమని ఆయన కోరారు. కానీ నేనే కొంత సమయం కావాలన్నాను’ అని అలీ చెప్పుకొచ్చారు. తన పాదయాత్ర సమయంలో జగన్ పలువురికి టికెట్‌పై హామీ ఇచ్చారని, అందువల్ల తనకు టికెట్ దక్కే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని జగన్ ఆదేశిస్తే తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు.