జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్లాను .. 75 రూపాయలు ఇచ్చారు: శేఖర్ మాస్టర్
Add ap7am to your home Screen

జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్లాను .. 75 రూపాయలు ఇచ్చారు: శేఖర్ మాస్టర్

  • డాన్సర్ కావాలని వచ్చాను
  • అవకాశాలు పెద్దగా ఉండేవి కావు
  •  ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోలేను  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ పాల్గొన్నారు. "ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవమానాలు .. కష్టాలు ఎదురుకావడం, మనసుకి బాధ కలిగించే సంఘటనలు సహజంగానే జరుగుతుంటాయి. అలాంటి బాధ మీకు ఎప్పుడైనా కలిగిందా?" అనే ప్రశ్న అలీ నుంచి శేఖర్ మాస్టర్ కి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "ఇండస్ట్రీకి నేను డాన్సర్ ను అవుదామనే వచ్చాను. డాన్సర్ గా నేను కుదురుకోకముందు చాలా కష్టాలు పడ్డాను. డాన్సర్ గా మూడు నాలుగు నెలలకోసారి అవకాశం వచ్చేది. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుందామంటే .. వాళ్లు వెనక్కి వచ్చేయమంటారని భయం. అందువలన సినిమాలకి .. సీరియల్స్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్లడం మొదలుపెట్టాను. జూనియర్ ఆర్టిస్ట్ గా నేను అందుకున్న ఫస్టు పేమెంట్ 75 రూపాయలు. ఆ డబ్బులు చూసుకుని నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు" అంటూ చెప్పుకొచ్చారు.
sekhar master
ali

More Telugu News