క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే బాధగా ఉంది: కంగన రనౌత్
- పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ‘మహానాయకుడు’
- 'మహానాయకుడు’ కలెక్షన్ల రిపోర్ట్ గురించి విన్నాను
- ‘మణికర్ణిక’పై మీడియా కూడా దుష్ప్రచారం చేసింది
ఈ విషయాన్ని తెలుసుకున్న కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కలెక్షన్ల రిపోర్ట్ గురించి విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో నేను ‘మణికర్ణిక’ ప్రాజెక్టును స్వీకరించినపుడు నాపై ఎటాక్ చేసి.. నన్ను హింసించి నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాంబదుల్లా నన్ను పీక్కుతిన్నారు. మరిప్పుడేమంటారు? క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా ‘మణికర్ణిక’పై దుష్ప్రచారం చేశాయి. మన స్వాతంత్ర్య సమరయోధులు దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందించినందుకు నాకు చాలా బాధగా ఉంది’ అంటూ కంగన విమర్శలు గుప్పించింది.