సినీ ఇండస్ట్రీకి ఓ గొప్ప దర్శకుడు దూరమయ్యారు: హాస్యనటుడు అలీ
- ఒక క్యారెక్టర్ ని ఎలివేట్ చేయాలంటే కోడి రామకృష్ణే
- ఆయన వద్ద ఒక సినిమాలో నటిస్తే చాలు
- ఆ నటుడికి ఎంతో పేరొస్తుంది
కోడి రామకృష్ణ సినిమాల్లో దాదాపు నలభై చిత్రాల్లో తాను నటించానని అన్నారు. ‘ఈటీవీ’లో తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో తాను పాల్గొంటానని కోడి రామకృష్ణ చెప్పారు కానీ, ఆ అదృష్టం తమకు దక్కలేదని చెప్పారు. ఇండస్ట్రీకి ఓ గొప్ప దర్శకుడు దూరమయ్యారని, కోడి రామకృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అలీ అన్నారు.