ఆర్థిక ఇబ్బందుల్లో హీరోయిన్ భూమిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్థిక ఇబ్బందుల్లో హీరోయిన్ భూమిక

  • గతంలో పలు సినిమాల్లో నటించిన భూమిక
  •  భర్త చేస్తోన్న వ్యాపారాల్లో నష్టాలు
  •  సినిమాల్లో బిజీ కావడానికి ప్రయత్నాలు    
వెండితెరపై గ్లామర్ పరంగా హద్దులు దాటకుండా .. సంప్రదాయ బద్ధమైన కథానాయికగా తెలుగు - తమిళ భాషల్లో భూమిక మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో కథానాయికగా చేసినవి తక్కువ సినిమాలే అయినా, అవి ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేశాయి. 'ఖుషీ' .. 'ఒక్కడు' .. 'సింహాద్రి' .. 'మిస్సమ్మ' సినిమాలు యూత్ లో ఆమె క్రేజ్ ను అమాంతంగా పెంచేశాయి.

అలాంటి భూమిక .. భరత్ ఠాకూర్ తో వివాహమైన తరువాత నటనకు దూరమైంది. ఈ మధ్యనే ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణాలనే టాక్ అప్పుడే వినిపించింది. తాజాగా ఆమె తెలుగు .. తమిళ భాషల్లో తనకి గల పరిచయాలతో మరిన్ని అవకాశాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోందట. ఇటీవల తరచుగా ఆమె ఫొటో షూట్స్ చేస్తుండటం విశేషం. తన భర్త చేస్తోన్న వ్యాపారాల్లో భారీగా నష్టాలు రావడంతో, తాను తిరిగి సినిమాల్లో బిజీ కావాలనే ఉద్దేశంతోనే భూమిక ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
bhumika

More Telugu News