అలాంటిదేమి లేదంటోన్న బోయపాటి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలాంటిదేమి లేదంటోన్న బోయపాటి!

  • భారీ చిత్రాల దర్శకుడిగా బోయపాటి
  • చరణ్ మూవీ ఫ్లాప్ తో విమర్శలు
  •  నెక్స్ట్ మూవీ బాలకృష్ణతో    
యాక్షన్ ను .. ఎమోషన్ ను మిక్స్ చేసి మాస్ ఆడియన్స్ ను అలరించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. దర్శకుడిగా ఆయన ఖాతాలో భారీ విజయాలు వున్నాయి. అలాంటి బోయపాటి 'వినయ విధేయ రామ' సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువగా కలిపేయడం వలన దెబ్బతినేసింది. దాంతో అంతకుముందు బోయపాటితో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిన నిర్మాతలు వెనక్కి తగ్గారట.

అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లు తమ ఆలోచనను విరమించుకున్నట్టుగా ఆయనతో చెబుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే విషయాన్ని బోయపాటి దగ్గర ఎవరు ప్రస్తావించినా, అలాంటిదేమీ లేదంటూ సింపుల్ గా సమాధానమిస్తున్నట్టుగా సమాచారం. తనపై వస్తోన్న ఇలాంటి విమర్శలన్నీ కూడా, బాలకృష్ణతో హిట్ పడిన తరువాత సర్దుకుంటాయని అంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ప్రాజెక్టు పనిలో వున్న ఆయన, మరోసారి తన సత్తా చాటుకుంటాడేమో చూడాలి. 
boyapati

More Telugu News