నాకు టెస్టులు పెట్టకండి సార్ అని హీరో సూర్యతో చెప్పేశాను: దర్శకుడు బండి సరోజ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు టెస్టులు పెట్టకండి సార్ అని హీరో సూర్యతో చెప్పేశాను: దర్శకుడు బండి సరోజ్ కుమార్

  • సూర్యకి నేను చెప్పిన కథ బాగా నచ్చింది
  • నిర్మాతగా జ్ఞానవేల్ రాజా ముందుకు వచ్చాడు
  •  ప్రోమో షూట్ దగ్గరే వాదన జరిగింది     
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో దర్శకుడు .. నటుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ, తన కెరియర్ ఆరంభంలో జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావించాడు. నేను హీరో విశాల్ కి ఒక కథ వినిపించాను .. అది ఆయనకి బాగా నచ్చేసింది. అదే సమయంలో సూర్యకి కథ చెప్పే అవకాశం రావడంతో ఆయనకి చెప్పాను .. ఆయనకి కూడా నచ్చేసింది. ఈ సినిమాను నిర్మించడానికి జ్ఞానవేల్ రాజా ముందుకు వచ్చాడు.

నన్ను ఒక ప్రోమో షూట్ చేసి చూపించమన్నారు. అది నచ్చకపోతే .. కొంత ఎమౌంట్ కి స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్లిపొమ్మని జ్ఞానవేల్ రాజా అన్నాడు. అయితే, ప్రోమోకి అవసరమైన బడ్జెట్ ను ఇవ్వడానికి వాళ్లు అంగీకరించకపోవడంతో అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తరువాత నాకు సూర్య నుంచి ఫోన్ కాల్ వస్తే .. జరిగింది చెప్పాను. "నువ్వు ఎంతవరకూ నిలబడగలవు అనే విషయాన్ని చెక్ చేసుకోవడం కోసం నీకు టెస్ట్ పెట్టాము .. ఈ అవకాశం కోల్పోయినందుకు నువ్వు చాలా ఫీల్ అవుతావు" అని సూర్య అన్నారు. దాంతో నేను "సార్ స్కూల్ డేస్ నుంచి ప్రతి రోజు ఎగ్జామ్స్ రాసి రాసి నాకు బోర్ కొట్టేసింది .. ఇంకా నాకు టెస్టులు పెట్టకండి .. నాపై నాకు నమ్మకం వుంది" అని అన్నానంటూ చెప్పాడు. 
bandi saroj kumar

More Telugu News