NTR: బాలకృష్ణ ఔదార్యం... 'కథానాయకుడు' కొన్నవారికే 'మహానాయకుడు'... నష్టాన్ని భరిస్తానని హామీ!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ బయోపిక్ గా రూపుదిద్దుకున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' బయ్యర్లకు నష్టాన్నే మిగల్చడంతో నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'కథానాయకుడు' కొన్నవారికే 'మహానాయకుడు' చిత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారిక ప్రకటనను వెలువరించారు. ఇదే సమయంలో 'కథానాయకుడు' నష్టాల్లో 33 శాతం భరిస్తానని, 'మహానాయకుడు'కు వచ్చే ఆదాయంలో 40 శాతం బయ్యర్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో 'మహానాయకుడు' విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోగా, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ హీరో బాలయ్య డేరింగ్ డెసిషన్ తీసుకున్నారని నందమూరి అభిమానులు సంబరంగా చెబుతున్నారు.
Go Back to Shorts
NTR
Biopic
Kadhanayakudu
Mahanayakudu
Balakrishna

More Telugu News