మోహన్ బాబు గారిని చూడగానే .. ఇండస్ట్రీలో చాలాకాలం ఉంటాడని అనుకున్నాను: సీనియర్ నటి అన్నపూర్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోహన్ బాబు గారిని చూడగానే .. ఇండస్ట్రీలో చాలాకాలం ఉంటాడని అనుకున్నాను: సీనియర్ నటి అన్నపూర్ణ

  • మోహన్ బాబుగారి సరసన 'స్వర్గం నరకం'చేశాను
  •  మురళీమోహన్ విషయంలో అలాగే జరిగింది
  •  రంగనాథ్ గారు అలాగే పాప్యులర్ అయ్యారు  
అన్నపూర్ణ 'స్వర్గం నరకం' సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయికగా నటించారు. ఆ తరువాత ఆయనకి తల్లి పాత్రల్లోను చేశారు. అలాంటి అన్నపూర్ణ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఏ ఆర్టిస్ట్ అయినా మేకప్ చేసుకుని రాగానే, ఆ ఆర్టిస్ట్ ఏ పాత్రలకి బాగుంటాడు .. ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటాడు అనే ఆలోచన చేసేదానిని.

ఎవరినైతే చూసి ఇతను ఇండస్ట్రీలో చాలా కాలం ఉంటాడని అనుకున్నానో, వాళ్లంతా కూడా నిజంగానే చాలాకాలం పాటు ఇండస్ట్రీలో వున్నారు. మోహన్ బాబు గారిని 'స్వర్గం నరకం' సినిమా సమయంలో చూసినప్పుడే, ఆయన ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉంటాడని అనుకున్నాను .. అలాగే జరిగింది. ఇక మురళీమోహన్ గారి విషయంలోను అలాగే జరిగింది. రంగనాథ్ గారి గంభీరమైన రూపం చూసి ఆయన తండ్రి పాత్రలకి బాగుంటాడనీ .. ఇండస్ట్రీలో బిజీ అవుతాడని అనుకున్నాను. ఆయన విషయంలోను అలాగే జరిగింది" అని చెప్పుకొచ్చారు.
annapurna

More Telugu News