నాకు ఇష్టమైన దర్శకులు వారే: సీనియర్ నటి అన్నపూర్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఇష్టమైన దర్శకులు వారే: సీనియర్ నటి అన్నపూర్ణ

  • రాఘవేంద్రరావు గారు గొప్ప దర్శకుడు
  • ఆర్టిస్టుల పరిస్థితిని అర్థం చేసుకుంటారు
  • వాళ్ల సినిమాలంటే టెన్షన్ ఉండదు  
తెలుగు తెరపై తల్లి పాత్రల ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేసిన నటీమణిగా అన్నపూర్ణ కనిపిస్తారు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొనగా, 'ఇష్టమైన దర్శకులు ఎవరు?' అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు అన్నపూర్ణ స్పందిస్తూ .. "నాకు బాగా నచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు. తెలుగు చిత్రపరిశ్రమలో శిఖరం వంటి వారాయన.

ఎవరినైనాసరే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. డేట్స్ సర్దుబాటు చేయవలసి వస్తే, ఆర్టిస్ట్ ల పరిస్థితిని అర్థం చేసుకుని .. కూల్ గా పంపించేస్తారు. ఆ తరువాత కోదండరామిరెడ్డి .. ముత్యాల సుబ్బయ్య గార్లు అంటే ఇష్టం. ఈ ఇద్దరూ కూడా చాలా మంచి మనుషులు .. ఎలాంటి పరిస్థితుల్లోను ఆర్టిస్టుల మనసులను నొప్పించరు. వాళ్లతో సినిమాలంటే ఎంతమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు" అని చెప్పుకొచ్చారు. 
annapurna

More Telugu News