జీవితకు తమాషా అయిపోయింది..!: కౌశిక్ రెడ్డి ఫైర్
- నేనొక క్రికెటర్ ని.. నేనేమీ రౌడీ షీటర్ ని కాదు
- దేశం తరపున జెండా మోసిన వ్యక్తిని నేను
- నాడు చిరంజీవి పైనా జీవిత లేనిపోని వ్యాఖ్యలు చేసింది
జీవితకు తమాషా అయిపోయిందని, నాడు చిరంజీవి మీద, అరవింద్ పైనా లేనిపోని వ్యాఖ్యలు చేసిందని విమర్శించారు. జీవితను పట్టించుకునే వాళ్లెవరూ లేకపోవడంతో ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయాలని చూస్తోందని, ఆ న్యూస్ క్రియేట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారని విమర్శించారు. నిజంగా, బాధ కలిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వెళ్లిపోకుండా మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేంటని జీవితను ప్రశ్నించారు. రాజకీయంగా తనను అపకీర్తిపాలు చేసేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.