గోపీచంద్‌, కత్రినా జంటగా 'టైగర్ జిందా హై' రీమేక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్‌, కత్రినా జంటగా 'టైగర్ జిందా హై' రీమేక్

  • తిరు దర్శకత్వంలో గోపీచంద్
  • హిందీలో హిట్టయిన 'టైగర్ జిందా హై'  
  • జరీన్ ఖాన్ ప్లేస్ లో తమన్నా
తెలుగు తెరపై యాక్షన్ హీరోలుగా ఎక్కువ మార్కులు కొట్టేసినవారిలో గోపీచంద్ ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రం 'తిరు' దర్శకత్వంలో రూపొందుతోంది. ఇది సల్మాన్ ఖాన్ చేసిన 'టైగర్ జిందా హై' సినిమాకి రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. సల్మాన్ .. కత్రినా కైఫ్ జంటగా 2017 డిసెంబర్లో వచ్చిన 'టైగర్ జిందా హై' భారీ వసూళ్లను సాధించింది. సల్మాన్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఈ సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సల్మాన్ పాత్రలో గోపీచంద్ .. కత్రినా పాత్రలో తమన్నా కనిపించనున్నారు. కథానాయికగా ముందు జరీన్ ఖాన్ ను అనుకున్నప్పటికీ, ఆ తరువాత తమన్నాను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 
gopichand
tamannah

More Telugu News