ఇక నన్ను సినిమాలు ఆపేయమన్న నిర్మాతే నాతో చేయడానికి ముందుకొచ్చారు!: డా. రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక నన్ను సినిమాలు ఆపేయమన్న నిర్మాతే నాతో చేయడానికి ముందుకొచ్చారు!: డా. రాజశేఖర్

  • 'గరుడ వేగ'తో సూపర్ హిట్
  •  'కల్కి' సినిమాపైనే దృష్టి
  •  విడుదల తరువాత మాట్లాడతాను  
చాలా కాలం తరువాత 'గరుడ వేగ' సినిమాతో రాజశేఖర్ హిట్ కొట్టారు. ఆ జోష్ తో ఆయన ప్రస్తుతం 'కల్కి' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. 'గరుడ వేగ' సినిమా హిట్ కి ముందు సినిమాలు చేయడం ఆపేయమని నిర్మాత కల్యాణ్ గారు అన్నారు. మీ పిల్లలు చూసుకుంటారు ..ఇక మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు.

అలాంటి ఆయన మళ్లీ నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నిజంగా ఇది నాకు ఆనందాన్ని కలిగించే విషయం. లోకంలో అసలు మనం చేయడానికి ఒక పని దొరకడమే కష్టం. అలాంటిది నాకు ఇప్పటివరకూ పని దొరుకుతోంది .. అందుకు నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. ఇక 'కల్కి' విషయానికొస్తే .. ఈ సినిమా విడుదల తరువాత మాట్లాడతాను అని అన్నారు. ఈ సినిమా టీజర్ ను ఈ రోజునే వదలనున్నారు. 
rajasekhar

More Telugu News